ట్రిపుల్​ఐటీ వద్ద బీజేపీ నిరసన.. అరెస్ట్​ చేసిన పోలీసులు

నిర్మల్​ జిల్లా బాసర ట్రిపుల్​ఐటీలో ఇటీవల ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య చేసుకోవడం  సంచలనం సృష్టించింది. వారి మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ జూన్ 19 న జిల్లా బీజేపీ నాయకులు ట్రిపుల్​ఐటీ గేట్​ ముందు నిరసనలు తెలిపారు. నిరసనల్లో బీజేపీ పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి పలువురు నేతలు పాల్గొన్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం తెలుసుకున్న పోలీసులు నేతలను అరెస్ట్​ చేశారు. పోలీసుల చర్యలపై గీతామూర్తి మండి పడ్డారు.  విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలని నాయకులు నినదించారు. వరుస ఆత్మహత్యలకు కారణాలు ప్రభుత్వం తెలియజేయాలని డిమాండ్​ చేశారు.