సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి తెలంగాణను వదిలేసి పొలిటికల్ టూరిస్టులా తిరుగుతున్నడని విమర్శించారు. కేసీఆర్ భారతదేశానికే కాదు.. ఉక్రెయిన్ కు కూడా ప్రధాని అవుతారని సెటైర్లు వేశారు. తన అవినీతి బండారం బయటపడకుండా ఉండేందుకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నడని తరుణ్ చుగ్ ఆరోపించారు. కేసీఆర్ ముఖంలో భయం కనిపిస్తోందన్న ఆయన.. ముఖ్యమంత్రి ఓటమి భయంతోనే ప్రశాంత్ కిషోర్ను తెచ్చుకున్నాడని అన్నారు. ప్రశాంత్ కిషోర్ వల్ల ఒరిగేదేమీ లేదని, ఆయన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తతో సమానమని చుగ్ అభిప్రాయపడ్డారు. తాము చేస్తున్న పోరాటం తెలంగాణను కాపాడుకునేందుకే తప్ప కేసీఆర్, బీజేపీ మధ్య జరుగుతున్నదని కాదని స్పష్టం చేశారు.
మరిన్ని వార్తల కోసం..