కవిత పర్యటనకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన

నిజామాబాద్​ జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటనను వ్యతిరేకిస్తూ స్థానిక బీజేపీ నేతలు నిరసనలు చేశారు. బోధన్​లో ఆగస్టు 16న కవిత వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చారు. 

ఆమె పర్యటన ఉండటంతో బీజేపీ నేతలు నిజాం షుగర్​ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలు చెల్లించడంతో పాటు.. బీఆర్​ఎస్​ అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని ఓపెన్​ చేయిస్తామన్నా హామీ నెరవేర్చాలంటూ డిమాండ్​ చేశారు. హామీలను గుర్తు చేస్తూ పోస్టర్​ ఆవిష్కరించారు. 

అనంతరం నల్లజెండాలతో నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్​నిజామాబాద్ కి అన్యాయం చేశారని లీడర్లు ఆరోపించారు. జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ధర్నాలు, రాస్తారోకో లు చేస్తామని హెచ్చరించారు.