యాదాద్రి, వెలుగు: బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో చేపట్టనున్న రథయాత్ర ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మంగళవారం భువనగిరిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఈ మేరకు ఆ పార్టీ లీడర్లు ఆదివారం సభ ఏర్పాట్లను పరిశీలించారు. రథయాత్ర మూడు రోజుల పాటు సాగనుందని, దాదాపు 200 మంది ముఖ్య నేతలు పాల్గొంటారని వారు తెలిపారు. రథయాత్ర యాదగిరిగుట్ట, ఆలేరు, మోటకొండూరు, ఆత్మకూర్ (ఎం), మోత్కూరు, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, చండూరు, మర్రిగూడ మీదుగా ఇబ్రహీంపట్నంలో ముగుస్తుందని వెల్లడించారు.