బీజేపీ రథయాత్రలు మళ్లీ వాయిదా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ రథయాత్రలు మళ్లీ వాయిదాపడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 నుంచి 21 దాకా రథయాత్రలు నిర్వహించాలి. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని 20వ తేదీకి వాయిదా వేశారు. సోమవారం అర్ధరాత్రి దాకా పార్టీ స్టేట్ ఆఫీస్​లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా 17 లోక్ సభ సీట్లను ఐదు క్లస్టర్లుగా విభజించారు. అన్నింట్లో ఒకేసారి రథయాత్ర ప్రారంభించాలని భావించారు.

మోదీ పదేండ్ల పాలనలో తెలంగాణకు చేసిన అభివృద్ధి, రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర పథకాలను ప్రతి పల్లెకు వెళ్లి వివరించాలనే ఉద్దేశ్యంతో ఈ యాత్రలు చేపట్టాలని జాతీయ నాయకత్వం ఆదేశించింది. అందులో భాగంగానే మొదటగా ఈ నెల 5 నుంచి 11 వరకు చేపట్టాలనుకున్నారు. సాధ్యపడకపోవడంతో దాన్ని మళ్లీ 10వ తేదీ నుంచి 21 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. మళ్లీ ఇప్పుడు మూడోసారి కూడా వాయిదా వేసి, 20 నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు.

ALSO READ:  త్యాగానికి ప్రతిరూపం రమాబాయి అంబేద్కర్