2023-24 లో బీజేపీకి పార్టీఫండ్ భారీగా వచ్చింది.గత సంవత్సరం తో పోలిస్తే మూడు రెట్లకంటే అధికంగా పార్టీ విరాళాలు సంపాదించింది. విరాళాల రూపంలో 2023-24లో ఏకంగా రూ. 2వేల 244 కోట్లు పొందింది. ఇక ప్రతిపక్ష పార్టీ, దేశంలో రెండో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ కు కేవలం రూ. 288.9 కోట్లు మాత్రమే వచ్చాయి. ప్రుడెంట్ ఎలక్టోకరల్ అధికంగా విరాళాలు ఇచ్చిన దాతగా ఉంది. నిబంధనల ప్రకారం ఎలక్టోరల్ బాండ్ రషీదులు మినహాయించబడ్డాయి.
2023-24లో వ్యక్తులు, ట్రస్టులు , కార్పొరేట్ సంస్థలు నుంచి రూ. 20వేలు అం తకంటే ఎక్కువ విరాళాల రూపంలో బీజేపీకి దాదాపు రూ. 2వేల 244కోట్లు వచ్చాయి. ఇది 2022-23తోలో వచ్చిన విరాళాల కంటే మూడు రెట్లు ఎక్కువ. మరోవైపు కాంగ్రెస్ కు 2023-24లో రూ. 288.9 కోట్ల విరాళాలు వచ్చాయి. గతేడాది కాంగ్రెస్ కు కేవలం 79.9కోట్లు మాత్రమే వచ్చాయి.
Also Read : IRCTC సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రైల్వే టికెట్ బుకింగ్స్
2023-24 లో రెండు పార్టీలకు వచ్చిన విరాళా వివరాల రిపోర్టులను ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లో ఉంచింది. ఫ్రూడెంట్ ఎలక్టోర్ ట్రస్ట్ నుంచి బీజేపీ రూ. 723.60కోట్ల విరాళాలు అందుకుంది. అదే కంపెనీ కాంగ్రెస్ కు రూ.156.4కోట్లు అందించింది. రెండు పార్టీలకు అత్యధిక విరాళాలు ఈ సంస్థ నుంచే వచ్చాయి. బీజేపీకి మూడింట ఒకవంతు, కాంగ్రెస్ కు సగానికి పైగా ఈ సంస్థనుంచే విరాళాలు అందాయి.
కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ 2023-24 కంట్రిబ్యూషన్ రిపోర్టులలో పార్టీ విరాళాలను ప్రకటించాయి. వీటిలో BRS 495.5 కోట్లు, డీఎంకే 60 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ రూ.121.5 కోట్లు, JMM రూ. 11.5 కోట్లుపొందినట్లు ప్రకటించాయి.