హుజురాబాద్ బైపోల్ వార్.. బీజేపీ స్టార్ క్యాంపైనర్లు వీళ్ళే

హుజురాబాద్ బైపోల్ వార్.. బీజేపీ స్టార్ క్యాంపైనర్లు వీళ్ళే

రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉపఎన్నిక కోసం బీజేపీ తమ స్టార్ క్యాంపైనర్ల లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్టులో 20 మంది నాయకులకు చోటు కల్పించింది. వారిలో బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, తరుణ్ చుగ్, కే. లక్ష్మణ్, మురళీధర్ రావు, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకట స్వామి, విజయశాంతి, చాడ సురేష్ రెడ్డి, రమేశ్ రాథోడ్, యెండల లక్ష్మీ నారాయణ, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, కూన శ్రీశైలం గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. 

కాగా.. ఈటల పాదయాత్రలో చురుకుగా పాల్గొంటున్న బొడిగే శోభకు చోటు దక్కలేదు. అదేవిధంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కూడా స్టార్ క్యాంపైనర్ లిస్టులో చోటు లభించకపోవడం గమనార్హం.

For More News..

ఈటలను గెలిపిస్తే గ్యాస్ ధర రూ.1500 చేస్తరు

నామినేషన్ వేసేందుకు క్యూ కట్టిన ఫీల్డ్ అసిస్టెంట్లు

అర్జున్ రెడ్డి డైరెక్టర్‎తో డార్లింగ్ ప్రభాస్ సినిమా