18వ లోక్ సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.సోమవారం మంగళవారం సమావేశాల్లో ఎంపీలంతా ప్రమాణ స్వీకారం చేయగా బుధవారం స్పీకర్ ఎన్నిక జరగనుంది. సాధారణంగా ఏకగ్రీవం కావాల్సిన స్పీకర్ ఎన్నిక ఈసారి కాలేదు. స్పీకర్ ని ఎన్నుకునే విషయంలో ఎన్డీయే కూటమి ఇండియా కూటమితో చర్చించలేదన్న కారణంగా తమ కూటమి తరఫున ఏం.కే. సురేష్ బరిలో నిలువనున్నారు.
ఎన్డీయే కూటమి తరఫున ఓం బిర్లా స్పీకర్ అభ్యర్థిగా ఉన్నారు.ఈ క్రమంలో ఎన్డీయే స్పీకర్ ఎన్నికలో తమ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతివ్వాలని వైసీపీని కోరినట్లు తెలుస్తోంది.ఇందుకు వైసీపీ అంగీకరించినట్లు సమాచారం అందుతోంది. మరి, లోక్ సభలో చరిత్రలోనే మొదటిసారి జరుగుతున్న స్పీకర్ ఎన్నికలో ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి.