బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి.. అట్టడుగు వర్గాలను అణచేస్తున్నాయి: రాహుల్ గాంధీ

బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ అట్టడుగు వర్గాలను అణచేస్తున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. బిహార్ పాట్నాలో సంవిధాన్ సురక్ష సమ్మేళన్ లో పాల్గొన్న రాహుల్ గాంధీ.. రాజ్యాంగం అంటే కేవలం బుక్ కాదు.. కొన్ని వేల సంవత్సరాల ఆలోచనల ప్రతిరూపమని అన్నారు. భారతదేశ ఆత్మ రాజ్యాంగంలోనే ఉందని.. రాజ్యాంగంతోనే ఓబీసీ, దళితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రైవేట్ సెక్టార్ లో దళితులకు ప్రాతినిథ్యం లేదని అన్నారు. 

ఎన్డీఏ సర్కార్ ప్రజల సొమ్మను అదానీకి అప్పగిస్తోందని విమర్శించారు రాహుల్. జీఎస్టీ పేరుతో మోదీ సర్కార్ ప్రజలను లూటీ చేస్తోందనీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం అంటే కేవలం బుక్ కాదని.. కొన్ని వేల సంవత్సరాల ఆలోచనల ప్రతిరూమని ఈ సందర్భంగా తెలిపారు. 

Also Read : ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ హామీలు

శనివారం (18 జనవరి) పాట్నాలో నిర్వహిస్తున్న  సంవిధాన్ సురక్ష సమ్మేళన్ లో పాల్గొఏందుకు వచ్చిన రాహుల్.. ఇండియా కూటమిలో భాగస్వామి అయిన RJD నేత తేజస్వీ యాదవ్ ను కలిశారు. అక్కడి నుంచి సంవిధాన్ సురక్ష సమ్మేళన్ కార్యక్రమానికి హాజరయ్యారు.