పెట్రో పన్నులు తగ్గిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు

పెట్రో పన్నులు తగ్గిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు

పెట్రోల్, డీజిల్ పై  కేంద్ర ప్రభుత్వం  ఎక్సైజ్ డ్యూటీ  తగ్గించడంతో... రాష్ట్రాలపైనా ఒత్తిడి పెరుగుతోంది.  పెట్రోల్ పై  5 రూపాయలు,  డీజిల్ పై 10 రూపాయలు  ఎక్సైజ్ డ్యూటీ  తగ్గించింది కేంద్రం.  కేంద్రం బాటలో  పయనించిన కొన్ని రాష్ట్రాలు నిన్ననే పెట్రోల్,  డీజిల్ పై  పన్నులను తగ్గిస్తున్నట్టు ప్రకటించగా.. ఒరిస్సా, మధ్యప్రదేశ్, హర్యానా లాంటి మరికొన్ని రాష్ట్రాలు ఇవాళ అదే బాటలో అడుగులు వేశాయి.

భారీగా తగ్గించిన యూపీ, హర్యానా రాష్ట్రాలు!

అస్సాం ప్రభుత్వం  పెట్రోల్, డీజిల్ పై  7 రూపాయల  చొప్పున పన్నులు తగ్గించింది.  గోవా ప్రభుత్వం  కూడా ఏడు రూపాయల  చొప్పున తగ్గించింది.  దీంతో ఆ రాష్ట్రంలో ఓవరాల్ గా   డీజిల్ పై 17 రూపాయలు , పెట్రోల్ పై  12 రూపాయలు తగ్గినట్టైంది.  త్రిపుర ప్రభుత్వం  కూడా పెట్రోల్,  డీజిల్ పై  7 రూపాయల  చొప్పున తగ్గించింది. బీజేపీ తో  పాటు దాని మిత్రపక్షాలు  అధికారంలో  ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ  పన్నులు తగ్గిస్తున్నాయి  అక్కడి ప్రభుత్వాలు. హర్యానా   ప్రభుత్వం పెట్రోల్,  డీజిల్ పై 12 రూపాయల చొప్పున  తగ్గిస్తున్నట్టు   ప్రకటించింది.

కర్ణాటక  ప్రభుత్వం  కూడా 7 రూపాయల  చొప్పున తగ్గించింది.  దీంతో  రాష్ట్రంలో పెట్రోల్  సగటున  95రూపాయల 50 పైసలకు, డీజిల్ 81 రూపాయల  50 పైసలకు  లభిస్తుందని  కర్ణాటక సీఎం  బసవరాజ్ బొమ్మై  ట్వీట్ చేశారు. గుజరాత్ లోనూ  ఏడు రూపాయల  చొప్పున తగ్గించింది  అక్కడి ప్రభుత్వం. ఉత్తరాఖండ్ లో పెట్రోల్,  డీజిల్ పై   రెండు రూపాయల  చొప్పున తగ్గించారు.   ఉత్తరప్రదేశ్ లో  యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం   పెట్రోల్, డీజిల్ పై  12 రూపాయల  చొప్పున తగ్గించినట్టు  వార్తలు వస్తున్నా... అధికారికంగా  ధృవీకరించలేదు  ప్రభుత్వం. మధ్యప్రదేశ్  ప్రభుత్వం   కూడా వ్యాట్ 4 శాతం తగ్గిస్తున్నట్టు  ప్రకటించింది.

ఈశాన్య  రాష్ట్రం మణిపూర్ లో  బీరేన్ సింగ్  నేతృత్వంలోని  బీజేపీ ప్రభుత్వం  7 రూపాయలు తగ్గించింది.  బీజేపీ మిత్రపక్షాలు  అధికారంలో  ఉన్న మిజోరంలో   కూడా  పెట్రోల్, డీజిల్ లపై 7 రూపాయలు  తగ్గించింది. సిక్కిం  ప్రభుత్వం   కూడా 7 రూపాయల చొప్పున తగ్గించింది. అరుణాచల్ ప్రదేశ్ లో  పెట్రోల్ పై   వ్యాట్ ను 20 శాతం  నుంచి 14.5 శాతానికి,  డీజిల్ పై 12.5 శాతం  నుంచి 7 శాతానికి  తగ్గిస్తున్నట్టు  ముఖ్యమంత్రి  పెమా ఖండూ ప్రకటించారు. ఇక బీజేపీ సంకీర్ణ   ప్రభుత్వం  ఉన్న బిహార్ లో... డీజిల్ పై  3 రూపాయల  90 పైసలు, పెట్రోల్ పై 3రూపాయల  20 పైసలు  తగ్గిస్తున్నట్టు  చెప్పారు  సీఎం నితీశ్ కుమార్. 

ఇక ఒడిశా  సర్కార్ కూడా... పెట్రో,   డీజిల్ ధరలు  తగ్గించింది. పెట్రోల్,  డీజిల్ పై  3 రూపాయల చొప్పున  వ్యాట్ తగ్గిస్తున్నట్టు   ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్  ట్వీట్ చేశారు. తగ్గించిన ధరలు రేపట్నుంచి  అమల్లోకి  వస్తాయన్నారు. వ్యాట్  తగ్గింపుతో  రాష్ట్రంపై  2వేల కోట్ల భారం పడుతుందన్నారు  పట్నాయక్.

మరిన్ని వార్తల కోసం..

పండుగ పూట విషాదం: కల్తీ మద్యంతో 17 మంది మృతి

గోల్డెన్ వీసా అందుకున్న తొలి తమిళ నటి త్రిష

అమ్మవారికి మొక్కి.. ఆలయంలో హుండీ చోరీ