ఖమ్మంలో కమలం జోష్

ఖమ్మం సిటీలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ గ్రౌండ్​లో ఆదివారం నిర్వహించిన ‘రైతు గోస.. బీజేపీ భరోసా’ సభ ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపింది. ప్రత్యేక బస్సులు, వెహికల్స్​లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అమిత్​షా ప్రసంగం మొదలుకాగానే  ‘జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై’ నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని మోదీ వేషధారణలో ఓ వ్యక్తి సందడి చేశాడు. 

ఓ బాలుడు ‘సేవ్​తిరుమల’ అంటూ ఫ్లకార్డుతో వచ్చి ఆలోచింపజేశాడు. సభ అనంతరం నిర్వహించిన కోర్ కమిటీ మీటింగ్​ 4 నిమిషాల్లోనే ముగిసింది. అన్నపురెడ్డిపల్లి మండలం బీజేపీ ఓబీసీ అధ్యక్షుడు జుబ్బూరు రమేశ్ ​ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక బస్సుల్లో అమిత్​షా సభకు తరలివచ్చారు.

– వెలుగు, ఖమ్మం టౌన్/అన్నపురెడ్డిపల్లి