న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పాకిస్థాన్ నుంచి మామిడి పండ్లు అందడంపై బీజేపీ సెటైర్లు వేసింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ నుంచి రాహుల్, సిబల్, థరూర్ సహా ఏడుగురు ప్రతిపక్ష ఎంపీలకు మామిడి పండ్లు అందడంపై గురువారం కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మీడియాతో మాట్లాడారు.
‘‘యూపీ మామిడి అంటే రాహుల్‌కు ఇష్టం లేదని గతంలో అన్నారు. యూపీ పండ్ల కంటే పాక్ పండ్లే ఇష్టమా? ఆయన చెప్పాలి” అని అన్నారు. మరో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఏ ప్రదేశం అయితే వారి మనసులో ఉందో అక్కడి నుంచే మామిడిపండ్లు వచ్చాయని కామెంట్ చేశారు.