హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు దళిత, గిరిజనులకు వ్యతిరేకమని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ విమర్శించారు. హాస్టళ్ల పర్యటన విద్యార్థులు మరణించాక చేపడుతున్నారని, ఇది ముందు చేసి ఉంటే మరణాలు సంభవించేవి కాదని చెప్పారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలకు సంక్షేమ పథకాలను ఎగ్గొట్టారని, వారికి కేటాయించాల్సిన నిధులను డైవర్ట్ చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటించిందని, బడ్జెట్ కూడా కేటాయించిందని, మరి పథకాలు ఎవరికి ఇచ్చారో చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్ కేవలం పేపర్లకే పరిమితమైందని, బీఆర్ఎస్ సర్కారు లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిధులను డైవర్ట్ చేస్తుందన్నారు.