బీజేపీ అగ్రనేత.. ఎల్ కే అద్వానీ కి అస్వస్థత

బీజేపీ అగ్రనేత..  ఎల్ కే అద్వానీ కి అస్వస్థత

భారతీయ జనతా పార్టీ బీజేపీ సీనియర్ నాయకుడు.మాజీ ఉప ప్రధాని, ఎల్.కె అద్వానీ (97) ఈరోజు ( December 14)  ఉదయం  అస్వస్థతకు గురయ్యా రు.దీంతో ఆయన్ని ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం  ( వార్త రాసే సమయానికి) ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య స్థితిపై వైద్యులు స్పష్టమైన ప్రకటన చేయవలసి ఉంది..బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉపప్రధాని ఎల్‌కే అద్వానీ(97) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉన్నారు. అద్వానీ ఆరోగ్య స్థితిపై వైద్యులు స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది.

ALSO READ : కుంభమేళా.. ఐక్యతా యజ్ఞం .. కుంభమేళాలో ఏఐ చాట్ బాట్ సేవలు: మోదీ

వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న అద్వాని కొంత కాలంగా  ఇంట్లోనే ఉంటున్నారు.  ప్రస్తుతం ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  రామ మందిర ప్రారంభానికి ఆహ్వానం అందినా... వృద్దాప్యం కారణంగా ఆయన ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు.  మూడోసారి ప్రధానిగా  మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత అద్వానీ నివాసానికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు.