మునుగోడులో బీజేపీ జెండా ఎగురబోతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. బీజేపీ గెలవకూడదని టీఆర్ఎస్ అన్ని రకాల ప్రయత్నాలు చేసిందని ఆయన ఆరోపించారు. బీజేపీ పై తప్పుడు ప్రచారాలు చేయించిందని మండిపడ్డారు. ఉపఎన్నికలో గెలుపు కోసం పోలింగ్ జరుగుతున్నప్పుడు కూడా... ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని వివేక్ వెంకటస్వామి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బూత్ అధ్యక్షులు కమిట్మెంట్ తో పనిచేయాలని అన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం రీ ఓపెనింగ్ కోసం తండ్రి కాకా వెంకటస్వామితో కలిసి తాను కృషి చేశానని చెప్పారు. ఈనెల 12న ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేయాలన్నారు.