ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలి

ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలి
  •     అంబేద్కర్​ నేషనల్ కాంగ్రెస్​ పార్టీ పిలుపు

హైదరాబాద్, వెలుగు :  బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లను ఎత్తేస్తుందని అంబేద్కర్ ​నేషనల్ కాంగ్రెస్​పార్టీ రాష్ట్ర చేపూరి రాజు ఆందోళన వ్యక్తం చేశారు. లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్.ఫాష్మీ ఆదేశాల మేరకు తాము తెలంగాణలో కాంగ్రెస్​పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు.

ఈ మేరకు బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. మతాన్ని, దేవుళ్లను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని, మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో లౌకికవాదం కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

13న దళితులంతా కలిసి ఓటుతో బీజేపీకి గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మాల మహానాడు నాయకులు చేపూరి శంకర్, భారతీయ భీంసేన నాయకుడు షేక్ మహబూబ్, తెలంగాణ కార్మిక సంఘం నాయకులు కె.అంజయ్య, నర్సింగరావు, చైతన్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.