కామారెడ్డి టౌన్/ బాన్సువాడ, వెలుగు: జహీరాబాద్పార్లమెంట్ స్థానంలో బీజేపీ గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే, జహీరాబాద్ బీజేపీ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణరెడ్డి పేర్కొన్నారు.
పార్లమెంట్ ప్రవాస్యోజనలో భాగంగా గురువారం కామారెడ్డి, బాన్సువాడలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో పార్టీకి మెజార్టీ ఓట్లు వచ్చినట్లే పార్లమెంట్ఎన్నికల్లోనూ రావాలన్నారు. ఇన్చార్జ్బద్ధం మహిపాల్‌రెడ్డి, జిల్లా ప్రెసిడెంట్అరుణతార, వరంగల్జిల్లా ఇన్చార్జ్ మురళీధర్‌గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, శ్రీనివాస్ గార్గే, దొరబాబు పాల్గొన్నారు.