2024 లోక్సభ ఎన్నికల ఖర్చు రూ.1737 కోట్లు..బీజేపీ ఎక్స్​పెండిచర్​రిపోర్ట్

2024 లోక్సభ ఎన్నికల ఖర్చు రూ.1737 కోట్లు..బీజేపీ ఎక్స్​పెండిచర్​రిపోర్ట్
  • ఎలక్షన్​కమిషన్​కు సమర్పించిన  ఎక్స్​పెండిచర్​రిపోర్ట్​లో కమలం పార్టీ వెల్లడి
  • కాంగ్రెస్​పార్టీ చేసిన వ్యయం కంటే 3 రెట్లు ఎక్కువ

న్యూఢిల్లీ: నిరుడు జరిగిన లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ రూ. 1,737.68 కోట్లు ఖర్చు చేసింది. పార్టీ ప్రచారానికి రూ.884.45 కోట్లు వ్యయం చేయగా, క్యాండిడేట్​ ఖర్చుల కోసం రూ.853.23 కోట్లు కేటాయించింది. ఎలక్షన్​ కమిషన్​ ఆఫ్​ఇండియాకు సమర్పించిన 2024 లోక్​సభ ఎన్నికల ఎక్స్​పెండిచర్​ రిపోర్ట్​లో ఈ విషయాన్ని ఆ పార్టీ వెల్లడించింది. 

న్యూస్​ పేపర్స్, ఎలక్ట్రానిక్ మీడియాలో అడ్వర్టైజ్​మెంట్స్​​, బల్క్ ఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ ప్రచారాలు, కేబుల్, వెబ్‌‌‌‌సైట్స్‌‌‌‌, టీవీ చానెళ్లలో ప్రమోషనల్ కంటెంట్‌‌‌‌తో సహా మీడియా ప్రకటనల కోసం రూ.611.50 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. పోస్టర్స్, బ్యానర్స్​, హోర్డింగ్స్​, ఫ్లాగ్స్​ కోసం రూ. 55.75 కోట్లు వ్యయం చేసింది. 

ఇక పబ్లిక్​ మీటింగ్స్, బహిరంగ సభలు, ఊరేగింపులు, ప్రచార సభలు, వేదికల ఏర్పాట్లు, ఆడియో సెటప్‌‌‌‌లు, బారికేడ్లు, వెహికల్స్​కోసం అదనంగా రూ.19.84 కోట్లు వినియోగించింది.  అలాగే, స్టార్​ క్యాంపెయినర్ల  ప్రయాణ ఖర్చులకు  రూ.168.92 కోట్లు, ఇతర పార్టీ నాయకుల ప్రయాణానికి రూ.2.53 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. 

ఇక అసెంబ్లీ ఎలక్షన్స్​ జరిగిన అరుణాచల్​ ప్రదేశ్​లో రూ. 5,552.57 కోట్లు, సిక్కింలో రూ. 5,552.41 కోట్లు, ఒడిశాలో రూ.5,555.65 కోట్లు ఖర్చు చేసినట్టు బీజేపీ తన నివేదికలో వివరించింది. కాగా, కాంగ్రెస్​ పార్టీ 2024 లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూ.585 కోట్లు ఖర్చు చేసింది. 

ఈమేరకు నిరుడు ఈసీకి ఎలక్షన్​ ఎక్స్​పెండిచర్​ వ్యవరాలు వెల్లడించింది. అంటే కాంగ్రెస్​పార్టీ చేసిన వ్యయం కంటే బీజేపీ ఖర్చు 3 రెట్లు ఎక్కువగా ఉన్నది. దీంతో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడంతోపాటు ఆయా రాష్ట్రాల్లో గెలుపు కోసం బీజేపీ ప్రధానంగా ప్రచారంపై ఆధారపడినట్టు ఈ ఖర్చుల నివేదిక ద్వారా తెలుస్తున్నది.