గోమాతను వధించిన కౌన్సిలర్‌ను అరెస్ట్ చేయాలి
ఫిర్యాదు చేసినోళ్లపైనే కేసు పెడ్తారా? : బండి సంజయ్
ధర్మపురి పోలీసుల తీరుపై ఫైర్
అరెస్ట్ చేసిన వారిని రిలీజ్ చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు : ‘‘బక్రీద్ సందర్భంగా జగిత్యా ల జిల్లా ధర్మపురిలో అందరూ చూస్తుండగా.. గోమాతను వధించిన కౌన్సిలర్‌పై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు”అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కౌన్సిలర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారినే అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది అత్యంత దుర్మార్గం, అన్యాయం అని శుక్రవారం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో మండిపడ్డారు. వెంటనే కౌన్సిలర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గోమాతను వధించడాన్ని నిరసిస్తూ ధర్మపురి ప్రజలు స్వచ్ఛందంగా బం ద్ పాటించడం హర్షణీయమని తెలిపారు. గోమాత ను వధించడం నేరమని తెలిసినా చట్టాన్ని అమలు చేయకపోవడం కేసీఆర్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని వివరించారు. తాను నిఖార్సయిన హిందువునని చెప్పకునే కేసీఆర్.. దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అమాయకులపై పెట్టిన నాన్ బెయిలెబుల్ కేసులు వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా రిలీజ్ చేయాలని పేర్కొన్నారు. లేకపోతే శనివారం స్వయంగా ధర్మపురికి వస్తా నని, తర్వాత పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రేపు వరంగల్‌కు బండి సంజయ్
మోదీ 8న వరంగల్‌కు రానుండడంతో సభా ఏర్పాట్లు పరిశీలించేందుకు ఆదివారం బండి సంజయ్ వరంగల్ వెళ్లనున్నారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో సభ నిర్వహిస్తున్నారు. సభా స్థలి పరిశీలించి నేతలకు దిశానిర్దేశం చేస్తారు.