బీరు, బ్రాందీ అమ్మితేగానీ ఉద్యోగులకు జీతాలియ్యలేని పరిస్థితి: కిషన్ రెడ్డి

బీరు, బ్రాందీ అమ్మితేగానీ  ఉద్యోగులకు జీతాలియ్యలేని పరిస్థితి: కిషన్ రెడ్డి

 బీరు, బ్రాందీ అమ్మితేగానీ  తెలంగాణలో ఉద్యోగులకు జీతాలియ్యలేని పరిస్థితి వచ్చిందన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి.కల్వకుంట్ల కుటుంబం నుంచి  తెలంగాణను రక్షించుకోవాలన్నారు. మద్యం ఏరులై పారుతున్న బీఆర్ఎస్ సర్కార్ ను గద్దె దించాలని కోరారు.రాష్ట్రంలో  భూములమ్మితే గానీ ప్రభుత్వం నడవడం లేదన్నారు.

ALSO READ :Asia Cup 2023: పాకిస్తాన్ బ్యాటింగ్.. నేపాల్‌కు భారత అభిమానుల మద్దతు 

మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు చెన్నమనేని వికాస్ రావు కుమారుడు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.   దేశంలో అత్యధిక పెట్రోల్ ధరలు తెలంగాణలోనే ఉన్నాయని విమర్శించారు.  కేంద్రప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ కు  లేదన్నారు.  ఆర్టీసీ ఛార్జీలు,భూముల రిజిస్ట్రేషన్, ఔస్ ట్యాక్సీలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు.  తెలంగాణ ప్రజలను గాలకొదిలేశారని.... ఇవాళ  బీరు, బ్రాందీ అమ్మందే కానీ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదన్నారు.    దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరు  నెలల ముందే వైన్స్ లకు టెండర్లు  పిలిచి సొమ్ము చేసుకున్నారని బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒప్పందం కుర్చుకుని పార్టీ ఆఫీసులకు ల్యాండ్ కేటాయించారని ్వజెత్తారు.