హైదరాబాద్,వెలుగు: ఈ నెల 12న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కూడా అటెండ్ కానున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపోటములపై చర్చించనున్నారు.
దీంతో పాటు రాష్ట్రంలో బీజేపీ విస్తరణకు, అనుసరించాల్సిన విధానాల పైన చర్చించనున్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంపై దీంట్లో డిస్కషన్ చేయనున్నారు. మరోపక్క కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుకు బీజేపీతో పాటు, అనుబంధ విభాగాల ఆధ్వర్యంలోను కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.