మంథని, వెలుగు: బీఆర్ఎస్ రాక్షస పాలనను తరిమికొట్టాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డి అన్నారు. మంథని పార్టీ ఆఫీసులో శనివారం వివిధ మండలాలకు చెందిన సుమారు 300 మంది మహిళలు, యువత సునీల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లాకు చెందిన ప్రవళిక పోటీ పరీక్షలు వాయిదా వేయడంతో ఆత్మహత్య చేసుకోవడం, ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మోహన్ రావు, క్రాంతికుమార్, రాజేందర్, కుమార్, మౌనిక, సౌమ్య, మల్లికార్జున్, బుర్ర రాజు పాల్గొన్నారు.