మంథని, ముత్తారం, వెలుగు: మంథనిలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని బీజేపీ ఆఫీసులో శుక్రవారం సునీల్ రెడ్డి సమక్షంలో మంథని మండలం మల్లారం, మహదేవపూర్ మండలం కన్నెపల్లి, కాటారం మండలం దామరకుంట, మల్హార్మండలం రావులపల్లి, ముత్తారం మండలం పాత, కొత్త జిల్లల్లపల్లి, అడవిశ్రీరాంపూర్ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన చెందిన మహిళలు, యువత పార్టీలో చేరారు.
సునీల్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంథనిలో బీజేపీ బలపడుతోందని, 40 ఏండ్ల కాంగ్రెస్ పాలన, 10 ఏండ్ల బీఆర్ఎస్పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పోతరవేన క్రాంతి కుమార్, మండల అధ్యక్షుడు పెయ్యల కుమార్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కర్రె శ్రీవాణి తో పాటు తదితరులు ఉన్నారు.