నిరుద్యోగులకు అండగా ఉంటా.. : మోహన్ రావు పటేల్

భైంసా, వెలుగు : పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు అండగా ఉంటానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రావు పటేల్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా భైంసా  లోని దారాబ్జి ఫ్యాక్టరీ పక్కన మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత స్టడీ  సెంటర్ ను ప్రారంభించారు. ముధోల్ నియోజకవర్గంలో  నిరుద్యోగులకు అన్ని వసతులతో  స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ రీడింగ్ రూమ్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్ముందు మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తానని హమీచ్చారు. సుభాష్ పటేల్, గాలి రవి కుమార్, రామకృష్ణ, పెరుగు నవీన్, నిరుద్యోగులు పాల్గొన్నారు.