గెలుపే ధ్యేయంగా  పని చేయాలి : రామారావు పటేల్

కుంటాల, వెలుగు : రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు గెలుపే ధ్యేయంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పవార్ రామారావు పటేల్ పిలుపునిచ్చారు.  ఆదివారం కుంటాలలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటనను సక్సెస్​ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆప్క గజ్జరాం, నాయకులు నారాయణ రెడ్డి, మండల పార్టీ బాధ్యులు నర్సయ్య, పిప్పేర వెంగళ్ రావు పాల్గొన్నారు.