ప్రధాని మోదీకి స్వాగతం పలికిన ధన్ పాల్

నిజామాబాద్​అర్బన్, వెలుగు: ఇందూరు జన గర్జన సభ కోసం నగరానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కలెక్టరేట్ లోని హెలిప్యాడ్ వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్​పాల్ సూర్యనారాయణ స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు అర్బన్ నియోజకవర్గం వేల సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారని పేర్కొన్నారు. సభ విజయవంతానికి కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.