గుట్టల విధ్వంసంపై విచారణ జరిపించాలి : దిలీప్  ఆచారి

గుట్టల విధ్వంసంపై విచారణ జరిపించాలి : దిలీప్  ఆచారి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్  మండలం తూడుకుర్తి గ్రామంలో 200 ఎకరాలకు పైగా ఉన్న ఎర్రమన్ను గుట్టను ధ్వంసం చేయడంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పాత్ర ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీప్  ఆచారి ఆరోపించారు. బుధవారం బీజేపీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రమేయంతో చెరువుల్లో నల్లమట్టి, గుట్టల విధ్వంసం జరుగుతుందన్నారు. పల్లె పల్లెకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వెళ్లగా, విధ్వంసం ఘటన తమ దృష్టికి వచ్చిందన్నారు.

విచారణ జరిపిస్తే అవినీతిపరుల పేర్లు బయటకు వస్తాయని చెప్పారు. రెవెన్యూ, పోలీస్, రాజకీయ నాయకుల కలిసి ఎలాంటి పర్మిషన్లు లేకుండా మట్టి తరలిస్తున్నారని తెలిపారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సుధాకర్ రెడ్డి, నారాయణచారి, శ్రీశైలం, లక్ష్మణ్  పాల్గొన్నారు.