
లోకేశ్వరం వెలుగు : ప్రజలను మోసం చేయడమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రావు పటేల్ ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పల్లె పల్లెకు బీజేపీ, గడపగడపకు మోహన్ రావు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం నాటికి నియోజకవర్గంలో 104 గ్రామాలు,4 మండలాల్లో ప్రచారాన్ని పూర్తి చేశామన్నారు. వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పోతన్న, నరహరి పటేల్, అనిల్ పటేల్, సుమన్ పాల్గొన్నారు