ఓటుతో కేసీఆర్ అహంకారాన్ని అణచివేయాలి:తరుణ్ చుగ్

మునుగోడు ప్రజలు తమ ఓటుతో  కేసీఆర్ అహంకారాన్ని అణచివేయాలని బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్కు అహంకారం తలకెక్కిందని మండిపడ్డారు. మునుగోడు ప్రజలు బీజేపీకి ఓటేసి కేసీఆర్ అహంకారాన్ని దించాలని కోరారు. మునుగోడులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. 

ఎనిదేళ్లుగా తెలంగాణలో కేసీఆర్ చేసిందేమీ లేదని తరుణ్ చుగ్ అన్నారు. బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. దళితబంధు పేరుతో దళితులను కేసీఆర్ మోసం చేశారని..ఎవరికి దళిత బంధు రాలేదన్నారు. బీజేపీ అభ్యర్థి అయిన రాజగోపాల్ రెడ్డిని, టీఆర్ఎస్ అభ్యర్థిని ఓటర్లు పోల్చి చూడాలని కోరారు. ఇద్దరిలో ఎవరి మంచివారో..ఎవరు ప్రజలకు సేవ చేస్తారో...ఎవరు కష్టాల్లో ప్రజలకు అండగా నిలబడ్డారో  ఆలోచించాలన్నారు.  రాజగోపాల్ రెడ్డి గెలుపు ప్రజల గెలుపన్నారు. రాజగోపాల్ రెడ్డి గెలుపు తెలంగాణ గెలుపు అని తరుణ్ చుగ్ చెప్పారు.