కమలాపూర్: హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ పరామర్శించారు. ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య (104) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా శనివారం తరుణ్ ఛుగ్ ఈటల రాజేందర్ ను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సంతాప పత్రాన్ని ఈటల రాజేందర్ కు అందజేశారు. అనివార్య కారణాల వల్ల ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాలేకపోతున్నారని, ఈ క్రమంలోనే తనతో సందేశం పంపించారని తెలిపారు.
కాగా... బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య (104) ఆగస్టు 22న అనారోగ్యంతో మృతి చెందారు. మల్లయ్యకు ఎనిమిది మంది సంతానం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. ఈటల రాజేందర్ రెండో కుమారుడు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్యను హైదరాబాదులోని ఆర్వీఎం ఆస్పత్రి మెడికల్ కాలేజీలో చేర్పించి చికిత్స అందించారు. అయితే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఇటీవల కన్నుమూశారు.