మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ ఫోకస్ పెట్టారు. మునుగోడులోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కో ఇంచార్జ్ అరవింద్ మీనన్తో కలిసి పార్టీ కమిటీలతో సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ నాంపల్లి, మర్రిగూడ మండలంలోని కమిటీలతో ఆయన సమావేశంకానున్నారు.
సాయంత్రం బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలతో భేటీకానున్నారు. ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్ధేశం చేయనున్నారు. మునుగోడు ఉపఎన్నికపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన నివేదిక ఇవ్వనున్నారు.