డబుల్ ​ఇంజన్ ​సర్కారు కోసం ఎదురుచూస్తున్రు : రవీందర్​ నాయక్​

ఇల్లెందు, వెలుగు : తెలంగాణ రాష్ట్ర ప్రజలు డబుల్​ ఇంజన్​ సర్కారు కోసం ఎదురు చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి రవీందర్​నాయక్​ తెలిపారు. శుక్రవారం బీజేపీ ఇల్లెందు నియోజకవర్గ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఆశలతో సాధించుకున్న తెలంగాణ  కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్ బయటకు వస్తారన్నారు.

రాష్ట్రంలో గిరిజన బంధు, దళిత బంధు, బీసీ, మైనార్టీలకు ఆర్థికసాయం అని మోసం చేస్తున్న బీఆర్​ఎస్​ సర్కారు ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చిందో చెప్పాలన్నారు. పేపర్ లీకేజీలను చేస్తూ, పరీక్షలను వాయిదా వేస్తూ నిరుద్యోగుల ఉసురు తీస్తోందన్నారు. బెల్ట్ షాపులను పెంచి యువతను మద్యానికి బానిసలుగా మారుస్తున్న బీఆర్​ఎస్​ సర్కారుకు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.  ఆయన వెంట జిల్లా సమన్వయకర్త నాళ్ల  సోమ సుందర్, నియోజవర్గ ఇన్​చార్జి బాలగాని గోపి గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య, జిల్లా నాయకులు సురేందర్, మండల అధ్యక్షులు బాలాజీ, రామరావు, జర్పుల రాం​చందర్​  ఉన్నారు.