ఆరాచకాలు భరించలేకనే షకీల్‌ను ఇంటికి పంపిన్రు : మేడపాటి ప్రకాష్​రెడ్డి

బోధన్​, వెలుగు:  బోధన్​ నియోజకవర్గ ప్రజలు 10  ఏండ్ల  నుంచి ఎమ్మెల్యే  షకీల్​ ఆరాచకాలు భరించలేకనే  ఇంటికి  పంపించారని బీజేపీ రాష్ట్ర  వర్గసభ్యులు మేడపాటి ప్రకాశ్‌ రెడ్డి అన్నారు.  మంగళవారం ఆయన నివాసంలో  ప్రెస్​మీట్​ నిర్వహించారు.  ఈ సందర్భంగా మేడపాటి ప్రకాష్​ రెడ్డి, బీజేపీ అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..   బోధన్​ నియోజకవర్గ ప్రజలు ఏనాడు లేని విధంగా బీజేపీ పార్టీకి 33,555 ఓట్లు వేశారన్నారు.  

బీజేపీ నాయకులు, కార్యకర్తలు నెలరోజుల పాటు రాత్రి-పగలు తేడా లేకుండా పార్టీ  గెలుపుకోసం కృషి చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.  ఎలాంటి మద్యం, డబ్బులు లేకుండా స్వచ్ఛందంగా ఓట్లు వేశారన్నారు.  బీఆర్‌‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీ చేసినందుకు గెలిచారని ఆరోపించారు.  

తాను కాంగ్రెస్​ పార్టీకి అమ్ముడుపోయానని కొంత మంది పుకార్లు చేశారని, అమ్ముడుపోతే  ఇంత మెజార్టీ వచ్చేది కాదన్నారు.  అలాంటి  వ్యక్తుల మాటలు నమ్మవద్దని సూచించారు.  రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో బోధన్, సాలూర, ఎడపల్లి,  రెంజల్, నవీపేట్​ మండలాలకు చెందిన అధ్యక్షులు మనోహార్​ పటేల్, ప్రవీణ్‌, ఇంద్రకరణ్, మేక సంతోష్ పాల్గొన్నారు.