- రథయాత్ర, లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుపై చర్చ
హైదరాబాద్, వెలుగు : బీజేపీ స్టేట్ ఆఫీసు బేరర్ల మీటింగ్ శుక్రవారం పార్టీ స్టేట్ ఆఫీసులో జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు స్టేట్ ఆఫీసు బేరర్ల మీటింగ్, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులతో సమావేశం జరగనుంది. దీనికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్ చీఫ్ గెస్టుగా రానున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్రంలోని పార్టీ ఆఫీసు బేరర్లు
అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ నెల 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఐదు ఎంపీ క్లస్టర్లలో ప్రారంభించనున్న రథ యాత్రలపై చర్చించి, రోడ్ మ్యాప్ ఖరారు చేయనున్నారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధించేందుకు ఇప్పటి వరకు పార్టీపరంగా చేపట్టిన ప్రోగ్రామ్స్ ఏంటి.. ఎన్నికల కోసం నియమించిన కమిటీల పనితీరుపై ఇందులో సమీక్షించనున్నారు