కరీంనగర్ గడ్డ తనకెంతో ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. కరీంనగర్ లో జరుగుతున్న ప్రజాసంగ్రామయాత్ర ముగింపుసభలో ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోతే కార్యకర్తలు ఏడ్చారని..దానిపై దేశం అంతా చర్చ జరిగిందన్నారు.
కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా అని..కార్యకర్తల కష్టం వల్లే తాను గెలిచానని చెప్పారు. అవమానాలకు తాను భయపడనని చెప్పారు. కరీంనగర్ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. పింక్ జెండాతో అపవిత్రమైన తెలంగాణను కాషాయ జెండాతో పవిత్రం చేయమని జాతీయ నాయకత్వం సూచించిందని తెలిపారు. అందుకే ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టినట్లు తెలిపారు