సీఎం కేసీఆర్ కోసం జైల్లో రూం రెడీగా ఉంది

బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని కల్పిస్తామని బండి సంజయ్ తెలిపారు. అంతేకాకుండా ఉచిత విద్య..ఉచిత వైద్యానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. కేసీఆర్ కు దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలి అని సవాల్ విసిరారు. కేంద్రం ఇచ్చిన  నిధులను రాష్ట్ర సర్కార్ పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. కేసీఆర్ కోసం కరీంనగర్, అదిలాబాద్, చర్లపల్లి జైల్లలో రూంలు రెడీగా ఉన్నాయన్నారు. బీజేపీ ప్రజల కోసం, ధర్మం కోసం పనిచేస్తే.. కేసీఆర్ మాత్రం ఆయన కుటుంబం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. 

సీఎం కేసీఆర్ హైదరాబాద్లో మతవిధ్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనే కుట్రలకు పాల్పడ్డారని బండి సంజయ్ ఆరోపించారు. లిక్కర్ స్కాం అంశాన్ని పక్కదారి పట్టించేందుకు అల్లర్లను తెరపైకి తెచ్చినట్లు తెలిపారు. హిందూ దేవుళ్లను తిట్టిన మునావర్ ఫారూఖి సభకు అనుమతి ఉంటుందని కానీ.. బీజేపీ సభకు ఉండదని మండిపడ్డారు. 21 రోజుల యాత్ర తర్వాత సీఎం కేసీఆర్ కు శాంతిభద్రతలు గుర్తొచ్చాయని ఎద్దేవా చేశారు. సీఎం చెబితే గొడవలు అయితయ్.. వద్దంటే ఆగిపోతాయని చెప్పారు. 

బీజేపీ మతవిధ్వేషాలను రెచ్చగొడుతోందని సీఎం అసత్యాలు మాట్లాడడం సిగ్గుచేటని బండి సంజయ్ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ఎన్నో కుట్రలు చేసిందని.. అయితే అన్నింటిని చేధించి యాత్రను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. బీజేపీ కార్యకర్తలపై పీడీ యాక్డులు పెడుతున్నారన్న ఆయన బైంసాలో కార్యకర్తలు ఎంఐఎంను తట్టుకుని నిలబడ్డారని చెప్పారు.