బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రజాప్రతినిధులపై జరుగుతున్న దాడుల అంశంపై నేతలు చర్చిస్తున్నారు. నిన్న ఎంపీ అరవింద్ పై జరిగిన దాడిని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. కాషాయ నేతలు కార్యకర్తలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ పై చర్చిస్తున్నారు. రేపు నిజామాబాద్ కు వెళ్లనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. టీఆర్ ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన కార్యకర్తల్ని , నేతలను పరామర్శించనున్నారు.
మరిన్ని వార్తల కోసం