భాగ్యనగర్ ఉత్సవ సమితి మొజంజాహీ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషయంలో టీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేజీపై మాట్లాడేందుకు సిద్ధమైన అసోం సీఎం హిమంత బిశ్వశర్మను టీఅర్ఎస్ నేత వచ్చి ఆపే ప్రయత్నం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కరీంనగర్ లో ఆధ్యాత్మిక వాతావరణంలో గణనాథుల నిమజ్జనాలు జరుగుతున్నాయన్నారు.
మొజంజాహీ మార్కెట్ దగ్గర అసోం సీఎంకు పోటీగా.. మంత్రి తలసాని ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని గమనించిన భాగ్య నగర్ ఉత్సవ సమితి సభ్యులు.. అక్కడ మంత్రి తలసాని ఫ్లెక్సీని ఏర్పాటు చేయొద్దని కోరారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు, భాగ్య నగర్ ఉత్సవ సమితి సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఎంత వారించినా వినిపించుకోలేదు. ఇరువురి మధ్య గొడవ జరుగుతుండగానే కొందరు మంత్రి తలసాని ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు.