హైదరాబాద్ : కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై సెటైర్ ట్వీట్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే కారణంతో సంక్రాంతి పండుగకు పతంగుల మీద ఆంక్షలు విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటి ముందు వేసే సంక్రాంతి ముగ్గులు, రంగులు, చుక్కలతో పాటు ముగ్గుల సైజు , గొబ్బెమ్మల మీద కూడా ఏమైనా ఆంక్షలు ఉన్నాయా.. ? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు.