బీజేపీకి 20 ఏండ్లు ఢోకా లేదని పీకేనే చెప్పిండు

బీజేపీకి 20 ఏండ్లు ఢోకా లేదని పీకేనే చెప్పిండు

కరీంనగర్: తెలంగాణలో కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడే వరకూ తమ పార్టీ కార్యకర్తలంతా నిర్విరామంగా కొట్లాడుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు తీసుకొస్తామని, ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేలా కార్యకర్తలు పోరాడుతున్నారని అన్నారు. ఎంత మంది పీకేలు వచ్చినా.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడలేరని, మరో 20 ఏండ్లు బీజేపీకి ఢోకా లేదని పీకేనే చెప్పారని గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బండి సంజయ్ ను కరీంనగర్ జిల్లా నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకేనని, సామాన్య కార్యకర్త అయిన తనను జాతీయ నాయకత్వం గుర్తించేలా చేసింది కరీంనగర్ కార్యకర్తలేనని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తాను ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని చెప్పారు.

బీజేపీ కార్యకర్తలకు స్వార్థం ఉండదు

తెలంగాణలో కేసీఆర్ నియంత పాలన సాగుతోందని, దానిని గద్ధె దించేందుకు బీజేపీ కార్యకర్తలు కొట్లాడుతున్నారని బండి సంజయ్ అన్నారు. ఎన్ని రకాలుగా అణచివేతలకు గురి చేసినా.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలకు స్వార్థం ఉండదని, తమ కోసం కాకుండా రాష్ట్ర, జాతి ప్రయోజనాల కోసం కొట్లాడుతారని అన్నారు. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ను రెండోసారి అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి కార్యకర్త ఎంతో కృషి చేశారని అన్నారు. తమకు రాజకీయాలు ముఖ్యం కాదని ప్రజల సంక్షేమమే ప్రధానమని చెప్పారు.

ఒక్క చాన్స్ ఇవ్వండి

ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. ప్రధాని మోడీ కృషితో స్వస్థలాలకు చేరినా సీఎం కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ సర్కారు దుర్వినియోగం చేస్తూ ఆయన రివర్స్ లో కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ప్రజలు బీజేపీకి ఒక్క చాన్స్ ఇస్తే డబుల్ ఇంజన్ అభివృద్ధిని చేసి చూపిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

కారు బీభత్సం.. ఎమ్మెల్యేను చితకబాదిన జనం

పాటతో అలరించిన కలెక్టరమ్మ

టాలీవుడ్ రచయిత కందికొండ యాదగిరి కన్నుమూత