సీఎం ఎన్ని కుట్రలు చేసిన పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు

సీఎం కేసీఆర్ శాంతిభద్రతల సమస్యపై ఉన్నతస్థాయి రివ్యూ నిర్వహించడం విడ్డూరంగా ఉందని బండి సంజయ్ అన్నారు. వచ్చే శుక్రవారం నాడు హైదరాబాద్లో ఘర్షణలు సృష్టించేందుకు కేసీఆరే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్లో ఆరు ఉమ్మడి  జిల్లాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. పాదయాత్రను అడ్డుకుని, టీఆర్ఎస్ గూండాలతో దాడి చేయించారని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న స్పందనను చూసి తట్టుకోలేక అడ్డుకునే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 

సీఎం ఎన్ని కుట్రలు చేసినా, కేసులు పెట్టినా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్కు ఈడీ భయం పట్టుకుందని బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యత్ర పై ప్రజల్లో చర్చ జరుగుతుందని..27న బీజేపీ తలపెట్టిన సభను సీఎం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దుబ్బాక, హుజురాబాద్, హైదరాబాద్ లలో కార్యకర్తలు కష్టపడితేనే గెలిచామని.. మునుగోడులో కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.