ఢిల్లీకి బండి సంజయ్..హైకమాండ్​ పిలుపుతో పయనం

  • పార్టీ బలోపేతంపై సూచనలు చేయనున్న ఢిల్లీ పెద్దలు

హైదరాబాద్, వెలుగు:  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఢిల్లీ వెళ్లారు. పార్టీ హైకమాండ్​ నుంచి వచ్చిన పిలుపు మేరకు సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి బయల్దేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్ర బీజేపీలోని పరిణామాలు, మూడు రోజుల కిందట ఢిల్లీ వెళ్లి పార్టీ జాతీయ నేతలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చించిన పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. 

ALSO READ:రాజ్యాంగబద్ధ పదవులు..నజరానాలు కాకూడదు! : కూరపాటి  వెంకట్ నారాయణ

రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై హైకమాండ్​ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఐదారు నెaలలు మాత్రమే గడువు ఉండటంతో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించే చాన్స్​ ఉంది. పార్టీలో చేరిన కొందరు కీలక నేతలకు పార్టీ పరంగా ముఖ్యమైన బాధ్యతలు అప్పగించే విషయంపైనా చర్చించనున్నారు.