విజయదశమి సందర్బంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జిల్లాలోని మహా శక్తి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి వృక్షానికి పూజలు చేశారు. ఈ సందర్భంగా హిందూ బంధువులందరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా వేడుకలు జరుపుకుంటారని చెప్పారు. పేద ప్రజల కష్టాలు తొలగిపోవాలని, సమాజమంతా ఐక్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
దసరా సందర్భంగా నేతలంతా స్వార్థం వీడాలని బండి సంజయ్ కోరారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉండాలన్నారు. ధర్మ రక్షణ కోసం శక్తివంతమైన భారతదేశ నిర్మాణం, శక్తవంతమైన ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం అందరూ కంకణ బద్దులై ఉండాలన్నారు. భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను జరుపుకున్నామన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలన్నారు.