100 మందికి సభ్యత్వం చేయిస్తే.. యాక్టివ్ మెంబర్ షిప్

100 మందికి సభ్యత్వం చేయిస్తే.. యాక్టివ్ మెంబర్ షిప్
  • అలాంటోళ్లకే పార్టీపదవులు: కిషన్ రెడ్డి 
  • బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: కనీసం వంద మందికి పైగా పార్టీ సభ్యత్వం చేయించినోళ్లకు యాక్టివ్ మెంబర్ షిప్ ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. క్రియాశీలక సభ్యత్వం ఉన్న వారికే పార్టీ పదవులు వస్తాయని చెప్పారు. ఆదివారం సోమాజిగూడలోని ఓ హోటల్​లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి బూత్ లో 200 సభ్యత్వాలు టార్గెట్​గా పెట్టుకోవాలని సూచించారు. 

‘‘సభ్యత్వం కోసం ఎవరినీ మభ్యపెట్టాల్సిన అవసరం లేదని పార్టీ హైకమాండ్ తెలిపింది. బీజేపీ కార్యకర్తలకు అన్నింటి కంటే దేశమే ముఖ్యం. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇది ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయం” అని అన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలన్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పని చేస్తున్నదని చెప్పారు.