30 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ వరంగల్ కు రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 2023 జులై 08 శనివారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోడీ పర్యటన దృష్టా ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కిషన్ రెడ్డి జులై 07వ తేదీన వరంగల్ చేరుకున్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Also Read :- డీకే అరుణ కుమార్తె క్రెడిట్‌కార్డు చోరీ.. రూ.11 లక్షలను కాజేసిన డ్రైవర్..!
ప్రధాని మోదీ రెండు రోజుల పాటు వరంగల్‌లో పర్యటించనున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో రూ.6 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారన్నారు. రైలు వ్యాగన్ల తయారీ కేంద్రంతో పాటు పలు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. ఈ ప్రారంభోత్సవాలతో వరంగల్ దేశానికే తలమానికం అని కిషన్ రెడ్డి అన్నారు. ప్రారంభోత్సవాల అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో మోదీ ప్రసంగిస్తారన్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. బీజేపీ కార్యకర్తలకు, సభకు హాజరయ్యా ప్రజలకు పక్భందిగా ఏర్పాట్లు చేయాలని అధికారలును సూచించారు.