
అక్రమాలు ,అవినీతి చేయడం, వాటిని కప్పిపుచ్చుకునేందుకు వేదాలు వల్లించడం… సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు అలవాటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. దేశంలో వాళ్లు మాత్రమే రాజకీయాలు నడుపుతున్నమని అనుకుంటున్నారని, ఇంత పచ్చి అవకాశ వాదులు దేశంలో మరెవ్వరూ లేరని ఆయన విమర్శించారు. సీఎం కుర్చీ పోతుందని కేసీఆర్ కు ఎప్పుడు అసంతృప్తి,అభద్రతా భావమని అన్నారు. తాను చేసే తప్పులు బయటపడుతాయని భయం కేసీఆర్ కు ఉందని అన్నారు.
సీఎం కేసీఆర్ ఎన్ని అడ్డదారులు తొక్కి అధికారంలోకి వచ్చాడో తమకు తెలుసన్నారు లక్ష్మణ్. ఇరిగేషన్ ప్రాజెక్టు ల అవినీతి డబ్బుతో కేసీఆర్ ఎన్నికల నిర్వహించారన్నారు. “ఆయన గెలిస్తేనే ప్రజలు ఇచ్చిన తీర్పట..మేము గెలిస్తే అదిగెలుపు కాదంట.. మున్సిపల్ ఎన్నికల్లో 80 లక్షల ఖర్చు చేసినం అని సీఎం చెప్పిండు..ఇంత కన్నా అబద్దం ఇంకోటి ఉంటుందా?” అని ఆయన మండిపడ్డారు.
ఒంటరి పోరాటం చేశాం
ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ గెలించిందన్నారు లక్ష్మణ్. బీజేపీ గెలిస్తే సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నాడన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎన్ని అడ్డదారులు తొక్కలో అన్నీ చేశాడని, ఎన్నికల సంఘాన్ని కూడా సీఎం వాడుకున్నాడని ఆరోపించారు. తాము అన్ని రకాలుగా TRSతో పోరాటం చేశామన్నారు. “ఆ పార్టీ మద్యం తో పోరాటం చేసినం, డబ్బుతో పోరాటం చేసినం, TRS పోలీస్ తో పోరాటం చేసినం” అని అన్నారు లక్ష్మణ్. తుక్కుగూడా లో బీజేపీ మెజారిటీ వచ్చింది.. కానీ 5 వార్డులు వచ్చిన TRS పార్టీ మున్సిపల్ చైర్మన్ అయిందని అన్నారు
ఇది ఎంత వరకు కరెక్ట్….?
“ఆంధ్ర ఎంపీ ని తీసుకొచ్చి ఓటు వేయించారు..ఆంధ్ర రాజ్య సభ సభ్యుడిని తీసుకొచ్చి ఎలా ఓటు వేపిస్తారు?మరి మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం.. మేము కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడి మా ఎంపీ లను తీసుకొచ్చి ఓటు వేస్తే…మీకు మున్సిపాలిటీ లు దక్కుతాయా? మరి..అధికారులు కూడా ఆలోచించాలి… అధికార పార్టీకి వత్తాసు పలకడం కరెక్ట్ కాదు. TRS పార్టీ శాశ్వతం కాదనే విషయం అధికారులు గుర్తుంచుకోవాలి” అని లక్ష్మణ్ అన్నారు.