కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి : మాదగాని శ్రీనివాస్ గౌడ్

నల్గొండ అర్బన్, వెలుగు:  కేంద్రం నిధులతోనే గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.  మంగళవారం అర్బన్‌‌‌‌ మండలం నర్సింగ్ భట్ల గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి గుడిలో  పూజలు చేసి గడపగడపకు బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

Also Read : నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వర్తించాలి : ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని

కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలు తమవేనని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని మండిపడ్డారు. రేషన్‌‌‌‌ బియ్యంతో సహా పల్లె, పట్టణ ప్రగతి, ఈజీఎస్‌‌‌‌ నిధులన్నీ కేంద్రానివేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌‌‌లు అబద్ధపు హామీలతో అధికారంలోకి రావాలని చూస్తున్నాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలకు బుద్ధి చెప్పి... బీజేపీకి పట్టం కట్టాలని కోరారు.