- పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్
నల్గొండ అర్బన్/కనగల్, వెలుగు : నల్గొండలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు బీజేపీ’ కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం కనగల్ మండల పరిధిలోని దర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గడప గడపకు బీజేపీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.
ALSO READ: ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి : కలెక్టర్ ఎస్. వెంకట్రావు
కేంద్రం పథకాలను తామే ప్రవేశ పెట్టామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను అయోమయానికి గురి చేస్తోందన్నారు. మాయ మాటలు చెప్పే పార్టీల మోసాలను ప్రజలు పసిగట్టి రానున్న ఎన్నికలలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు శ్రీనివాస్ గౌడ్‌కు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బండారు ప్రసాద్, వంగూరి రాఖీ, గాలి శ్రీనివాస్, ఏరుకొండ హరితో పాటు జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.