అర్హులైన వారికి సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే ఎలా? : పల్లె గంగారెడ్డి

  •     బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి

ఆర్మూర్, వెలుగు : నిరుపేదలకు డబుల్ బెడ్ రూంలు ఇవ్వకుండా, అర్హులైన బీసీలకు ఆర్థిక సాయం చేయకుండా బీఆర్ఎస్​ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ శుక్రవారం ఆర్మూర్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి, ఆర్డీవోకు మెమోరండం అందజేశారు.

గంగారెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి అందని ద్రాక్షాగానే మిగిలిందని, ఇప్పటివరకు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, పెద్దోళ్ల గంగారెడ్డి, పుప్పాల శివరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.