ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతులకు ఇబ్బందులు : చింతల రామచంద్రారెడ్డి

  • బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి

హైదరాబాద్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు చింతల రామచంద్రారెడ్డి  కోరారు. రాష్ట్రంలో పలు చోట్ల వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెట్టకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన చెప్పారు.  మంగళవారం పార్టీ స్టేట్​ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇంకా రుణమాఫీ చేయలేదని, రైతు భరోసా ఇవ్వలేదని, ధాన్యం కొనుగోళ్లు జరపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.